సినీ న‌టితో క‌ల‌ర్ ఫోటో డైరెక్ట‌ర్ పెళ్లి!

షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని వెండితెర‌పై క‌ల‌ర్ ఫొటో లాంటి అద్భుత‌మైన సినిమాను ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు సందీప్ రాజ్. మొద‌టి సినిమాతోనే సందీప్ రాజ్‌ సూప‌ర్ హిట్ కొట్టేశాడు. సుహాస్, చాందినీ చౌద‌రీ హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన ఈ సినిమాకు ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. 2020లో వ‌చ్చిన ఈ సినిమాకు ప‌లు అవార్డులు కూడా వ‌రించాయి. అందులో ముఖ్యంగా జాతీయ అవార్డు రావ‌డం విశేషం. అయితే ఇప్పుడు సందీప్ రాజ్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఈసారి సినిమాల గురించి కాకుండా త‌నకు సంబంధించిన ఓ గుడ్ న్యూస్ ఆడియెన్స్ కు చెప్పాడు. త్వ‌ర‌లో సందీప్ పెళ్లి పీట‌లెక్క‌నున్నాడు. అమ్మాయి కూడా సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారే కావ‌డం విశేషం. ఆమె క‌ల‌ర్ ఫొటోలో చిన్న పాత్ర చేయ‌గా మ‌రిన్ని చిన్న సినిమాల్లో న‌టించారు. గత కొంత కాలంగా సందీప్‌ నటి చాందినీరావుతో ప్రేమలో ఉన్నాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ నెల నవంబర్ 11న వైజాగ్‌లో సందీప్ నిశ్చితార్థం జరగనుంది. డిసెంబర్ 7న తిరుపతిలో పెళ్లి జరగనుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *