ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన్న. పుష్ప సినిమాతో ఈ బ్యూటీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో పెర్మినెంట్‌గా సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుష్ప మాస్ హిట్ తో రష్మికకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ బ్యూటీ ఏకంగా సల్మాన్ ఖాన్ , విక్కీ కౌశల్ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలు హిట్ అయితే ఇక రష్మికకు బాలీవుడ్‌లో తిరుగేలేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే రష్మిక ఇటీవల దీపావళి సందర్భంగా కొన్ని స్పెషల్ పిక్స్ షేర్ చేసింది. ఫ్యాన్స్ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫోటోల్లో రష్మికతో ఎవరూ లేరు. కానీ, ఫోటో కింద క్యాప్షన్‌లో రష్మిక పిక్స్ క్రెడిట్స్ ఆనంద్ దేవరకొండ అని మెన్షన్ చేసి, థ్యాంక్ యూ ఆనందా… అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ అమ్మడు దీపావళి ఎక్కడ జరుపుకుందో చెప్పకనే చెప్పింది. రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ కుటుంబంతోనే రష్మిక దీపావళి జరుపుకుంది. రష్మిక , విజయ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయ.కానీ వీరిద్దరూ ఎప్పుడూ దానిపై ఓపెన్‌గా మాట్లాడలేదు. కానీ, అప్పుడప్పుడు ఇలాంటి ఫొటోలతో ఫ్యాన్స్ కు దొరికిపోతుంటారు. ఆ మధ్య కూడా ఇద్దరూ సోషల్ మీడియాలో వేర్వేరుగా పోస్టు చేసిన ఫోటోలు ఓకే లొకేషన్‌వి కావడం విశేషం. ఇద్దరూ కలిసి మాల్దీవులు కూడా వెళ్లారు. మరి ఇద్దరూ ఎప్పుడు తమ ప్రేమ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం డిసెంబర్ 5న రష్మిక నటించిన పుష్ప ది రూల్ విడుదలకు సిద్ధమవుతోంది.