విజయవాడ దుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి శ్రీ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. డిసెంబరు 25 వరకు ఈ భవానీ దీక్షలు కొనసాగనున్నాయి. దేవస్థాన వైదిక కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నేడు కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉదయం 7 గంటలకు శ్రీ భవానీ మండల దీక్షాధారణలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి రోజు శ్రీ భవానీ మండల దీక్షాధారణలు ముగుస్తాయి.