రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోళ్లలో నిబంధనలు పాటించని వ్యాపారులపై ఎస్మా కింద చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా రైతులను వేధిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రైతులకు క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.