నేడు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి అన్ని ఆలయాల్లో భక్తులు భారీగా తరలి వచ్చి దైవ దర్శనం చేసుకుంటున్నారు.శైవక్షేత్రాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంది. విద్యా సంస్థలకు సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా ఆలయాలకు వస్తున్నారు. ఈ రోజు ప్రతి ఇంటా పుణ్య స్నానాలు చేసి దీపాలతో శివుడిని ఆరాధించి పూజలు నిర్వహిస్తారు.