భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. గురు, శుక్రవారాల్లో ఆమె నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నగర పరిధిలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పంజాగుట్ట జంక్షన్, గ్రీన్‌ల్యాండ్ జంక్షన్, బేగంపేట్ ఫ్లైఓవర్, శ్యాంలాల్ బిల్డింగ్, పీపీఎన్టీ ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్ అవుట్గేట్, ఎయిర్‌పోర్టు వై జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, కత్రియ హోటల్, మెట్రో రెసిడెన్సీ, పీవీ విగ్రహం, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్‌తో పాటు ఫ్లైఓవర్‌పై ఆంక్షలు ఉంటాయన్నారు. ఎన్టీఆర్ మార్గ్, కట్టమైసమ్మ, ఇక్బాల్ మినార్, ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం జంక్షన్, అశోక్‌నగర్ జంక్షన్, ఎన్టీఆర్ స్టేడియం ప్రాంతాల్లో సైతం ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాదాపూర్, రాయదుర్గం, కొత్తగూడ, గచ్చిబౌలి, కొండాపూర్ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించిప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.