మూడు నెలల్లో వైజాగ్‌కు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఐదేళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యమన్నారు. టీడీపీ హయాంలో 2014-19 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయని చెప్పారు. ఎన్నో పారిశ్రామిక సదస్సులతో విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని విమర్శించారు. గతంలో హైదరాబాద్‌లో రేస్ జరిగితే దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగితే నాటి మంత్రి కోడి గుడ్డు పెట్టలేదని చెప్పారని విమర్శించారు.తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీలను కలిస్తే గత ప్రభుత్వంలో వాళ్లు వాటాలడిగారని చెప్పారని వెల్లడించారు.ఇందుకే పరిశ్రమలు వెళ్లిపోయాయన్నారు.