– దుర్గమ్మకు పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు హొంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. పవన్‌తో పాటు ఆయన కుమార్తె ఆద్య కూడా ఆలయానికి రావడం విశేషం. ఇటీవల తిరుమలకు తండ్రితో వచ్చిన ఆద్య, విజయవాడకు కూడా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా ఆలయం వద్ద అధికారులు పవన్‌కు స్వాగతం పలికారు. దర్శన అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. ఈ రోజు మరో మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది. ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.