రాష్ట్ర హజ్ కమిటీ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ మక్కాను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా జరగడం కమిటీ చరిత్రలో ఇదే తొలిసారి అని కమిటీ ఈవో లియాఖత్ హుస్సేన్ వెల్లడించారు. 2025 హజ్ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేల మంది యాత్రికులు వెళ్లనున్నారు. ప్రతి ఏడాది ఆరు లేదా ఏడు వేల మందికి మాత్రమే అవకాశం కల్పించే వారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపిక చేసిన 50 శాతం మందికి మాత్రమే పాదయాత్రకు అవకాశం ఉండేది. ఈ ఏడాది 10 వేల వరకు దరఖాస్తులు రాగా ఇప్పటికే 8,500 మందిని పాదయాత్రకు ఎంపిక చేశారు. మరో రెండు మూడు నెలల్లో మిగిలిన 1500 మందిని ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు. 2025లో జూన్ 4 నుంచి 9వ తేదీ వరకు హజ్ యాత్ర కొనసాగనుంది.