ఇటీవల తమ కుటుంబ తగాదాలతో వార్తల్లోకెక్కిన నటుడు మంచు మోహన్ బాబుకు పోలీసులు షాకిచ్చారు. ఆయనపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఇటీవల మోహన్ బాబు తన ఇంటి వద్ద కవరేజీ కోసం వచ్చిన మీడియా వ్యక్తులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో మోమన్ బాబుపై ముందు బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదైంది. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఈ గొడవ అనంతరం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం.