జల్‌జీవన్ మిషన్‌లో వైసీపీ హయాంలో రూ.4 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. విజయవాడలో జల్‌జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు. వైసీపీ హయాంలో నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటామనేది గుర్తించక ముందే పైపులు వేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.70 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకొని జల్‌శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామన్నారు.