పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఒక్కసారిగా పార్లమెంట్ ప్రాంగణమంతా గందరగోళంగా మారింది. ఈ తోపులాటలో ఒరిస్సాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర కింద పడిపోయారు. ఆయన తలకు గాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే రాహుల్ గాంధీ తోయడంతోనే తన తలకు గాయమైందని ప్రతాప్ చంద్ర ఆరోపించారు. దీనిపై రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించగా.. ఆయన పార్లమెంట్ లోపలికి వెళ్తున్న తనను బీజేపీ ఎంపీలు ఆపడానికి ప్రయత్నించారని, తనపై బెదిరింపులకు దిగారని, ఈ క్రమంలోనే ఇలా జరిగిందని , ఆ ఎంపీని తానే తోసేసానని చెప్పారు. బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ ఫిర్యాదు మేరకు రాహుల్ గాంధీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.