అక్ర‌మ కేసుల‌కు భ‌య‌ప‌డేది లేదు

త‌న‌పై ప్ర‌భుత్వం న‌మోదు చేస్తున్న అక్రమ కేసుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న త‌న‌పై న‌మోదైన ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు గురించి మాట్లాడారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో ఒక్క‌ పైసా కూడా అవినీతి జరగలేదన్నారు. దీనిపై లీగల్ గా పోరాడ‌తామ‌ని చెప్పారు. ఈ-కార్ రేసింగ్ లో మంత్రిగా తాను విధానపరమైన నిర్ణయ‌మే తీసుకున్నానని, ఏసీబీకి కేసు నమోదు చేసే హక్కు లేదని తెలిపారు. ఈ-కార్ రేసింగ్ లో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? లేదా అందరినీ ఆయ‌న‌ పక్కదోవ పట్టిస్తున్నారా? అని ప్రశ్నించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *