తెలంగాణ గ్రూప్-1 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నేడు హాల్‌టికెట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గైడ్‌లైన్స్ కూడా విడుదల చేసింది. తొలిరోజు తీసుకెళ్లిన హాల్ టిక్కెట్‌నే మిగిలిన ఆరు పరీక్షలకు తీసుకెళ్లాలని, రోజుకో కొత్త హాల్ టిక్కెట్‌తో వెళ్తే అనుమతించేది లేదని స్పష్టం చేసింది.