పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని ఓ యువకుడు నినాదాలు చేశాడు. సీఎం చంద్రబాబు ఆగ్రహానికి గురై సదరు యువకుడి పై మండిపడ్డారు. ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పేదల ఆదాయాన్ని పెంచడమే తన లక్ష్యం అన్నారు. నాటి తన పాలన ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఐటీ చదువుకున్నారని చెప్పారు. తనను అరెస్ట్ చేసి జైలులో పెట్టినా కూడా ఎక్కడా భయపడలేదన్నారు. తన కోసం 80 దేశాల్లో ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారని చెప్పారు. తన ముందు చూపునకు హైదరాబాద్ నగరమే నిదర్శనమన్నారు. సైబరాబాద్, హైటెక్ సిటీకి నామకరణం చేసింది తానేనని చెప్పారు.