మంచు విష్టు హీరోగా మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో దేశంలోని ప్రముఖ చిత్ర పరిశ్రమల నుంచి హేమాహేమీలు నటిస్తున్నారు. ఇప్పటికే పార్వతిగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మూవీ టీం ప్రభాస్ లుక్ రిలీజ్ చేసింది. ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు… శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ఓ క్యాప్షన్ జతచేశారు. చేతిలో ఒక ఆయుధంతో, నుదుట విబూది ధరించి, మెడలో రుద్రాక్షలతో ప్రశాంతంగా ఉన్న ప్రభాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. కన్నప్ప సినిమాలను ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.