ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి(కేపీ) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కేపీ గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం పోలీసులు కేపీ ఆత్మహత్యను నిర్ధారించి కేసు నమోదు చేసుకున్నారు. కేపీ 2016లో సినీ రంగంలోకి వచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి సినిమా తెలుగు వర్షన్ ఆయనే నిర్మించారు. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశారు. నిర్మాతగా కలిసి రాకపోవడంతో గోవాలో ఓ పబ్ స్టార్ట్ చేశారు. అక్కడా నష్టాలు రావడంతో డ్రగ్స్ విక్రయాలు చేశాడు. పలువురు సినీ తారలకు డ్రగ్స్ అమ్ముతూ వ్యాపారం చేశాడు. పలు డ్రగ్స్ కేసుల్లో కేపీ చౌదరి నిందితుడిగా ఉన్నారు.