వైసీపీ అధినేత వైయస్ జగన్ పులివెందులలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ను వైయస్ జగన్ ప్రారంభించారు. ఆస్పత్రిలో ఉన్న వసతులు, ప్రజలకు వైద్యం అందుతున్న తీరుపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా వైయస్ జగన్ కూడా కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వైయస్ జగన్ ప్రత్యేక హెలీ కాఫ్టర్‌లో బెంగళూరు వెళ్లనున్నారు.