బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సూర్యాపేటలో నిర్వహించిన సమావేశం గురించి మాట్లాడుతూ… ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తుంటే బహిరంగ సభకే వచ్చినట్లుందన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మళ్లీ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అవుతారన్నారు.