ఇటీవల హర్యానా ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇక్కడి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా.. నేడు హర్యానా సీఎంగా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నుంచి పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్యానా వెళ్లనున్నారు. సీఎం ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్డీఏ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పవన్ , చంద్రబాబు పాల్గొంటారు. ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మూడో సారీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకార మహోత్సవానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, తరలిరానున్నారు.