ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 అప్పట్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. పాయల్ నటనకు మాంచి మార్కులు పడ్డాయి. అయితే ఆ సినిమా తర్వాత పాయల్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఇటీవల వచ్చిన మంగళవారం సినిమాతో పాయల్ మళ్లీ సూపర్ హిట్ కొట్టింది. ఇందులోనూ నటనతో ఆకట్టుకుంది. కానీ పాయల్ చేసిన సినిమాల ఎఫెక్ట్ తో ఆమెకు అదే తరహా పాత్రలు రావడం బాధాకరం. ఇక సినిమా ఇండస్ట్రీలో అవకాశాలపై పాలయ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో నెపొటిజం వల్ల చాలా అవకాశాలు కోల్పోయినట్లు తెలిపింది. ఈ సందర్భంగా పాయల్ ఇండస్ట్రీలో కొనసాగడం అత్యంత కఠినమైన పరిస్థితి అని తెలిపింది.ప్రతి రోజు ఏదో తెలియని భయంతో రోజు మొదలవుతుందని, ఇండస్ట్రీ లో నెపోటిజం రాజ్యం ఏలుతుందని చెప్పింది. నిజమైన టాలెంట్ ఈ నెపోటిజం ముసుగులో కనుమరుగు అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను పడే కష్టానికి తగ్గ ఫలితం, టాలెంట్ కి తగ్గ అవకాశాలు భవిష్యత్తులో అయినా వస్తాయా లేదా అని ఆలోచించినప్పుడు భయం వేస్తుందని చెప్పింది.పెద్ద సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ల కారణంగా అవకాశాలు తన చెయ్యి నుండి జారిపోవడం చాలాసార్లు జరిగిందని, ఇలాంటివి తలచుకున్నప్పుడు మనసుకు చాలా బాధగా ఉంటుందని పాయల్ చెప్పుకొచ్చింది.