పోస్ట‌ర్‌తోనే ఆస‌క్తి పెంచేశారు!

ఈ మ‌ధ్య టాలీవుడ్‌లో చిన్న సినిమాల హ‌వా కొన‌సాగుతోంది. సినిమాల్లో స్టార్స్ లేక‌పోయినా క‌థ బాగుంటే హిట్ చేసేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఈ కోవ‌లోనే ఈ వేస‌వికి ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తేందుకు ‘వర్జిన్ బాయ్స్’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ గురు ఫిలిమ్స్‌పై రాజా దరపునేని నిర్మిస్తుండగా, దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. యువతను ఆకర్షించే కథాంశంతో ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. స్మరణ్ సాయి, మార్తాండ్ కె వెంకటేష్, వెంకట ప్రసాద్ వంటి టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. సినిమా పోస్టర్‌లో ఓ అమ్మాయి పెదాలపై ముగ్గురు యువకులు ఉన్నారు. ఒకరు కలర్‌ఫుల్ షార్ట్స్‌లో, మరొకరు స్కేట్‌బోర్డ్‌తో, ఇంకొకరు మ్యాగజైన్‌తో నవ్వుతూ కనిపించడం ఫన్ ఎలిమెంట్‌ను సూచిస్తోంది. బ్రో.. ఆర్ యు వర్జిన్? అనే ట్యాగ్‌లైన్ యువతలో ఆసక్తి రేకెత్తిస్తోంది. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్‌తో నిండిన ఈ చిత్రం భారీ ప్రమోషన్‌లతో సమ్మర్‌లో విడుదల కానుంది. పోస్టర్ అంచనాలను పెంచుతూ బాక్సాఫీస్ విజయానికి సిద్ధమవుతోంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన రానుంది. ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *