అక్కినేని వారసుడిగా సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ నేటికీ సరైన హిట్ అందుకోలేదు. ఇప్పటికీ గుర్తింపు కోసం కష్టపడుతూనే ఉన్నారు. తాజాగా అఖిల్ హీరోగా.. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ దర్శకుడు నందు అలియాస్ మురళీ కిషోర్ అబ్బూరు కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతుంది. ‘మనం ఎంటర్టైన్మెంట్’ తో కలిసి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అఖిల్ కెరీర్లో 6 వ సినిమాగా రూపొందుతుంది ఈ ప్రాజెక్టు. చిత్తూరు బ్యాక్ డ్రాప్లో రూపొందే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అట. మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయని సమాచారం. ఇక ఇందులో హీరోయిన్ గా శ్రీలీల ఖరారైంది. కచ్చితంగా ఇది ఆమెకు మంచి ఆఫర్ అనే చెప్పాలి. శ్రీలీలని కొన్నాళ్ల నుండి ప్లాపులు వెంటాడుతున్నాయి. స్కంద, ఆదికేశవ, రాబిన్ హుడ్ వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్లు అయ్యాయి. ఆమెకు తెలుగులో ఛాన్సులు తగ్గాయి. అఖిల్ సినిమా కనుక హిట్ అయితే వరుసగా ఆమెకు యంగ్ హీరోల సరసన కూడా ఛాన్సులు వస్తాయి. ప్రస్తుతం శ్రీలీల హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన ఒక సినిమా చేస్తుంది. ప్రస్తుతం అది చిత్రీకరణ దశలో ఉంది. బాలీవుడ్‌లో కూడా ఈ అమ్మడుకు మంచి అవకాశాలు వస్తున్నాయి. మరి వినరో భాగ్యము… అఖిల్, శ్రీలీలకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి!