అమ‌రావ‌తిలో జాతీయ స్థాయి డ్రోన్ స‌మ్మిట్ షురూ!

– సీఎం చంద్రబాబు చేతుల‌మీదుగా ప్రారంభం
– రెండు రోజుపాటు జ‌ర‌గ‌నున్న స‌ద‌స్సు
– నేడు 5,500 డ్రోన్లతో భారీ ప్రదర్శన

ఆంధ్ర ప్ర‌దేశ్‌ రాజ‌ధాని అమ‌రావ‌తిలో జాతీయ స్థాయిలో జ‌రుగుతున్న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ -2024 గ్రాండ్‌గా ప్రారంభ‌మైంది. మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్ష‌న్‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జ‌రుగ‌నున్న ఈ డ్రోన్ స‌మ్మిట్‌లో తొమ్మిది ప్యానల్‌ డిస్కషన్లు, 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్ర ముసాయిదా డ్రోన్‌ పాలసీని కూడా ఆవిష్క‌రించ‌నున్నారు. డ్రోన్ల‌కు ప్రాముఖ్య‌త పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ రంగంలో దేశంలోనే ప్ర‌థ‌మ స్థానంలో నిలిచేందుకు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేప‌థ్యంలో యువ పారిశ్రామిక వేత్తలు ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్ర‌భుత్వం కోరుతోంది. ఈ సమ్మిట్‌లో నేడు సాయంత్రం 5,500 డ్రోన్లతో దేశంలోనే అత్యంత‌ భారీ ప్రదర్శన చేప‌ట్ట‌నున్నారు. పౌర విమానయాన శాఖ, డీఎఫ్‌ఐ, సీఐఐ భాగస్వామ్యంతో నిర్వ‌హిస్తున్న ఈ స‌మ్మిట్‌కు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, సీఎస్ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ హాజ‌ర‌య్యారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *