అక్టోబర్ 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనుంది. ఈ మేరకు పార్టీ నాయకులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేయించాలని సూఇంచారు. రూ.100 సభ్యత్వంతో టీడీపీ కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులతో నామినేటెడ్ పోస్టుల గురించి చర్చించారు.