దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిన్నటి బాంబు బెదిరింపులను మరువకముందే మళ్లీ తాజాగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుంతోంది. శుక్రవారం ఉదయం పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు చేస్తూ ఈమెయిల్స్ వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేశారు. తాజాగా శనివారం అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు ఆయా హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఐఎస్ఐ పేరుతో బెదిరింపులు వచ్చిన రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటళ్లలో రష్యా, మలేషియాకు చెందిన మహిళలు 25 మంది వరకు ఉన్నారు. శ్రీవారి దర్శనానికి విదేశీయులు తిరుమలకు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో హోటళ్లకు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఎయిర్ పోర్టుకు సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. వరుస బాంబు బెదిరింపులతో శ్రీవారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.