Site icon

ఇండియాలో ఈ టెక్నాలజీకి మస్తు డిమాండ్.. ప్రారంభ వేతనం రూ.14 లక్షలు!

ఇండియాలో ఈ టెక్నాలజీకి మస్తు డిమాండ్.. ప్రారంభ వేతనం రూ.14 లక్షలు!

సైన్స్, టెక్నాలజీ సాయంతో ప్రపంచాన్నే గుప్పిట్లోకి తెచ్చిన సైంటిస్టులు.. ఇప్పుడు మనిషి మేధస్సుకే సవాల్ విసురుతున్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ కృత్రిమ మేధస్సుకు ఊపిరి పోస్తున్నారు. అలా వెలుగులోకి వచ్చిన చాట్‌జీపీటీ, డాల్‌-ఈ, బింగ్‌ ఏఐ, మిడ్‌ జర్నీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసులు చాప కింద నీరులా క్రమంగా అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా అందరూ అటు వైపు దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. ఏఐ ఆధారిత అనేక రంగాల్లో ఖాళీలు ఉన్నాయని, కాబట్టి ఈ టెక్నాలజీపై ఫోకస్ పెడితే ఈ ఉద్యోగాలను సంపాదించడం ఏమంత కష్టం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక్క ఇండియాలోనే వేలల్లో ఉద్యోగాలు ఉండగా.. లక్షల్లో జీతాలు ఇచ్చేందుకు సంస్థలు పోటీపడుతుండటం గమనార్హం.

రీసెంట్గా ప్రముఖ ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌ టీమ్‌ లీజ్‌ డిజిటల్‌ ఓ నివేదికను రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం.. హెల్త్‌ కేర్‌, ఎడ్యుకేషన్‌, బ్యాంకింగ్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, రీటైల్‌ విభాగాల్లో 45 వేల జాబ్స్ ఉన్నాయని తెలిపింది. ఏఐలో నిష్ణాతులైన ఫ్రెషర్స్‌కు స్టార్టింగ్ శాలరీ సంవత్సరానికి రూ.10 లక్షల నుంచి రూ.14 లక్షలు ఇచ్చేందుకు సంస్థలు మొగ్గుచూపుతున్నాయని టీమ్ లీజ్ తన నివేదికలో హైలైట్ చేసింది.

ఎక్కువగా ఆ రంగాల పైనే ఆసక్తి
ఏఐలో డేటా సైంటిస్ట్‌, ఎంఎల్‌ ఇంజినీర్లుగా పనిచేసేందుకు చాలా మంది మక్కువ చూపుతున్నారని ఓ నివేదిక పేర్కొంది. ఈ విభాగాల్లో రాణించేందుకు వృత్తికి అవసరమైన నైపుణ్యాల ప్రాముఖ్యత గురించి వివరించింది. గ్లోబల్‌ మార్కెట్‌లో డబ్బులు, సమయాన్ని ఆదా చేస్తూ మిలియన్ల మంది కస్టమర్ల అవసరాలను తీర్చేలా ఏఐ ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ టెక్నాలజీని నేర్చుకుంటే ఉద్యోగాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని పేర్కొంది.

ఏఐకి పెరుగుతున్న క్రేజ్
టీమ్‌ లీజ్‌ చేసిన సర్వేలో 37 శాతం కంపెనీలు ఏఐ టూల్స్‌పై ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఆ విభాగంలో అడుగుపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 30 శాతం సంస్థలు ఎంప్లాయీస్లో ఉన్న టాలెంట్ను వెలికితీసి వారికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అడుగుపెట్టేలా ప్రోత్సహిస్తున్నాయి.

ఇండియాలో వీరికే ఫుల్ డిమాండ్
భారత్‌లో ప్రస్తుతం ఫ్రెషర్లగా విధులు నిర్వహించే ఏఐ ఇంజినీర్లకు ఏడాదికి రూ.14 లక్షల వరకు జీతం ఇస్తున్నారు. అదే ఎంఎల్‌ ఇంజినీర్లకు అయితే రూ.10 లక్షలు, డేటా సైంటిస్ట్‌లకు రూ.14 లక్షలు, డెవాప్స్‌ ఇంజినీర్లకు రూ.12 లక్షలు, డేటా ఆర్కిటెక్చర్‌కు రూ.12 లక్షలు, బీఐ అనాలసిస్‌కు రూ.14 లక్షలు, డేటాబేస్‌ అడ్మిన్‌కు రూ.12 లక్షల వరకు శాలరీలు ఇస్తున్నట్లు టీమ్‌ లీజ్‌ తన నివేదికలో వివరించింది.

Share
Exit mobile version