Site icon

స్టార్ హీరోల గురించి బ‌న్నీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్‌’. ఇటీవలే ఈ షో నాలుగో సీజ‌న్‌ గ్రాండ్ గా ప్రారంభ‌మైంది. మొద‌టి సీజ‌న్‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు హాజ‌ర‌య్యారు.ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ షోకు అథితిగా వ‌చ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. షోలో భాగంగా బాల‌య్య బ‌న్నీని ప‌లు స‌ర‌దా ప్ర‌శ్న‌లు అడిగారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్, మహేశ్ బాబులలో నీకు బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఎవరు?’ అని బాలయ్య‌ ప్రశ్నించగా, అల్లు అర్జున్ తెలివిగా సమాధానమిచ్చారు. ”నన్ను మించి ఎదిగినోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే, అది రేపటి నేనే” అంటూ ‘పుష్ప 1’ సినిమాలోని ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్ లోని లిరిక్స్ ని జవాబుగా చెప్పారు. తనకు తానే బిగ్గెస్ట్ కాంపిటీషన్ అని చెప్పిన బన్నీ.. అదే సమయంలో తాను మిగతా హీరోలందరినీ గౌరవిస్తానని తెలిపారు. ‘మీకు ఇష్టమైన హీరో ఎవరు?’ అని అడగ్గా.. జెన్యూజ్ గా ఈ జెనరేషన్ యాక్టర్స్ అందరూ సూపర్బ్ గా చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ త‌న‌కు బాగా నచ్చింద‌న్నారు. నవీన్ పోలిశెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అడవి శేష్ లు బాగా నటిస్తున్నారని అల్లు అర్జున్ బదులిచ్చారు. ”మహేష్ బాబు గారు అంటే అందరూ ఆయన అందం గురించి మాట్లాడతారు. ఏదేమైనా ఆయన అందగాడు అని తెలిసిందే. నాకు పర్సనల్ గా నచ్చే విషయం ఏంటంటే, ఆయన కంబ్యాక్స్ చాలా బాగుంటాయి. ఫెయిల్యూర్ తర్వాత ఆయన కంబ్యాక్స్ చాలా బాగుంటాయి. దానికి నేను ఆయన్ను చాలా అడ్మైర్ చేస్తాను. ఆయనలో అది నాకు నాకు చాలా ఇష్టమైన విషయం. ఆయన ట్రూ సినిమా లవర్. ఆయన చిత్రాలతో తెలుగు సినిమా స్టాండర్డ్ ను పెంచిన యాక్టర్. నాకు ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉంది” అని బన్నీ అన్నారు.”ప్రభాస్ గురించి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నాది ఒకటే మాట.. ఆరడుగుల బంగారం. నేను ప్రతి ఏడాది క్రిస్మస్ ని బాగా డెకరేట్ చేస్తాను. అది తెలిసి ఒకసారి యూరప్ నుంచి చాలా పెద్ద బాక్స్ ని పంపించాడు. అందులో క్రిస్మస్ డెకరేషన్ వస్తువులున్నాయి. అది నాకు చాలా స్వీట్ మెమొరీ. అలాగే ఆయనకి చెట్లు అంటే చాలా ఇష్టం. నేనొక ఒక మొక్కని గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఆయన ఫామ్ హౌస్ లోనే చాలా పెద్దగా పెరుగుతోంది” అని అల్లు అర్జున్ చెప్పారు. ”కళ్యాణ్ గారి ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. సొసైటీలో లీడర్స్, బిజినెస్ పీపుల్స్ చాలామందిని ఫాలో అవుతుంటాను. కానీ నేను చూసిన వెరీ డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు” అని బన్నీ అన్నారు. అలానే ”బాలీవుడ్ లోని ఈ జెనరేషన్ లోనే ఫైనెస్ట్ యాక్టర్స్ లో రణబీర్ కపూర్ ఒకరు. ఆయన నా పర్సనల్ ఫేవరేట్ యాక్టర్. నాకు అతనంటే చాలా ఇష్టం” అని చెప్పారు. ఇదే షోలో బన్నీ జాతీయ అవార్డు అందుకోవడం గురించీ మాట్లాడారు. అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే తనకు బాగా కోపం వస్తుందని చెప్పుకొచ్చారు. బ‌న్నీ ఈ షోలో మాట్లాడిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Share
Exit mobile version