Site icon

సంధ్య థియేట‌ర్‌లో మ‌హిళ మృతిపై స్పందించిన అల్లు అర్జున్‌

ఇటీవ‌ల పుష్ప‌-2 విడుద‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట‌లో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ప్రీమియ‌ర్ షోకు హీరో అల్లు అర్జున్ రావ‌డం వ‌ల్లే తొక్కిస‌లాట జ‌రిగి మ‌హిళ ప్రాణాలు కోల్పోయింద‌ని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అల్లు అర్జున్ ఈ ఘ‌ట‌న‌పై నోరు విప్పారు. రేవ‌తి మృతికి తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. రేవ‌తి కుటుంబాన్ని వ్య‌క్తిగ‌తంగా క‌లుస్తాన‌ని, ఆమె కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

Share
Exit mobile version