టాలీవుడ్ హీరో నాని వరుస హిట్లతో ఊపుమీదున్నాడు. హిట్3 తో పాటు మరో సినిమాతో బిజీగా ఉన్న నాని తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ పై నాని చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాని ఇటీవల రానా హోస్ట్ గా చేస్తున్న ఓ షోకు అతిథిగా వచ్చాడు. ఈ షోలో నాని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు పాలిటిక్స్ లో కూడా పవర్ స్టారే అని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత రాజకీయాల్లో పవన్ సక్సెస్ అయ్యారు. దీంతో పవన్‌ను నాని పొగడ్తలతో ముంచెత్తాడు. పవన్ ఎంతో మందికి స్పూర్తినిచ్చారని నాని చెప్పుకొచ్చారు. దీనిపై రానా స్పందిస్తూ.. పవన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారని, ఆయన నిజంగానే సూపర్ స్టార్ అంటూ పొగిడాడు.