సినీ పరిశ్రమలో కమిట్మెంట్ గురించి ఎన్నో పుకార్లు ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది నటీమణులు ఈ విషయంపై బహిరంగంగానే స్పందించారు. కొంతమంది కమిట్మెంట్ ఇస్తేనే అవకాశం ఇస్తారని ధైర్యంగా చెప్పేశారు. ఇటీ మళయాళం ఇండస్ట్రీలో సైతం పలువురు అగ్ర తారలపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా తెలుగు నటి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. ఇటీవల సరికొత్త సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్యా థాపర్ ఇటీవల విశ్వం సినిమాలో గోపీచంద్ సరసన నటించింది కావ్యా. ఆమె గతంలో మోడల్‌గా కూడా పని చేసింది. అయితే తాను నటి అవ్వాలన్నది తన నాన్న కల అని, అందుకే సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చింది. ముందు మోడల్ గా పని చేసి తర్వాత మూవీస్ చేస్తున్నట్లు చెప్పింది. కావ్యా థాపర్ మోడల్‌గా ఉన్నప్పుడు కొత్తలో ఒకతను ఆఫర్ ఇస్తానని చెప్పి ఆఫీస్ కి ఆడిషన్ కి పిలిచాడట.ఆ టైం లో అతను కమిట్మెంట్ ఇస్తే నాలుగు యాడ్స్ ఆఫర్ ఇస్తానని చెప్పాడట. ఐతే తనకు మొహం మీదే నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అని తిరిగి వచ్చేశానని చెప్పుకొచ్చింది కావ్యా థాపర్. ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా సహజమని అప్పుడే అర్ధమైందని బాధ పడింది.