టాలీవుడ్‌లో మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కింది. మహానటి కీర్తి సురేశ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. తన చిరకాల మిత్రుడు, ప్రియుడు ఆంటోనీ తటిల్ ను కీర్తి పెళ్లాడింది. గోవాలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. కీర్తి సురేష్-తటిల్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరి వివాహం హిందూ సంప్రదాయంలో జరిగింది. శుక్రవారం చర్చిలో మరోసారి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరగనుంది. వీరి పెళ్లికి కేవలం కుటుంబం, సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ నుంచి ఎవరెవరు వెళ్లారనే విషయం బయటకు రాలేదు. సోషల్ మీడియా వేదికగా కీర్తికి అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.