Site icon

విజ‌య్‌తో ల‌వ్‌పై క్లారిటీ ఇచ్చేసిన ర‌ష్మిక‌

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం పుష్ప‌-2 ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉంది. పుష్ప సినిమాతో ర‌ష్మిక‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. ఇప్పుడు ఈ భామ బాలీవుడ్‌లో సైతం స‌ల్మాన్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ల‌తో సినిమాలు చేస్తుంది. ఇక ర‌ష్మిక‌కు రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మ‌ధ్య రిలేష‌న్‌షిప్ ఉంద‌న్న వార్త‌లు ఎప్ప‌టి నుంచో టాలీవుడ్‌లో వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. గీతగోవిందం, డియర్ కామ్రేడ్‌ సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ ఇద్దరు ఆఫ్ స్క్రీన్‌లో కూడా సూపర్ బాండింగ్ మెయింటైన్‌ చేస్తుంటారు. ర‌ష్మిక సైతం విజ‌య్ ఇంట్లో మ‌నిషిలా క‌లిసిపోతుంది. విజ‌య్ త‌మ్ముడి సినిమా ప్ర‌మోష‌న్ల‌కు కూడా హాజ‌రైంది. అయితే రిలేష‌న్‌షిప్‌పై మాత్రం రష్మిక, విజయ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏదీ చెప్ప‌లేదు. కానీ ర‌ష్మిక ఇప్పుడు అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టేసింది. చెన్నైలో జరిగిన పుష్ప 2 ఫంక్ష‌న్‌లో తన రిలేషన్‌ షిప్ స్టేటస్‌పై ర‌ష్మిక కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు..? అతడు ఇండస్ట్రీ చెందిన వారేనా? అని యాంకర్ అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అతడెవరో అందరికీ తెలుస‌ని చెప్పింది. రష్మిక సమాధానంతో ఆడిటోరియం అంతా అరుపులు,కేకలతో దద్దరిల్లిపోయింది. ఇక విజ‌య్ దేవ‌ర కొండ సైతం ఇటీవ‌ల తాను తాను డేటింగ్‌లో ఉన్నానని చెప్పాడు.

Share
Exit mobile version