శివ కార్తికేయ‌న్‌కు సాయిప‌ల్ల‌వి స్ట్రాంగ్ కౌంట‌ర్‌!

సాయి పల్లవి, శివ కార్తికేయన్ జంట‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌చ్చిన తాజా చిత్రం అమరన్. ఈ మూవీ సూప‌ర్ హిట్ టాక్‌తో థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. సాయి ప‌ల్ల‌వికి జ‌నాల్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అయితే సినిమాలో హీరో శివ కార్తికేయన్ అయిన‌ప్ప‌టికీ క్యారెక్టర్ పరంగా సాయి పల్లవి ప‌ర్ఫామెన్స్ కు చాలా ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అలాగే థియేట‌ర్ల‌లో త‌న సీన్ల‌లో జ‌నాల గోల మామూలుగా లేదు. ఇక‌ తమిళ‌ హీరో నటించిన చిత్రం అయిన‌ప్ప‌టికీ తెలుగులో ఈ సినిమా భారీ విజయం సాధించిందంటే అందులో సాయి పల్లవి రోల్ ఉంద‌ని చెప్పొచ్చు.ఈ మూవీ కి సంబంధించి చెన్నైలో నిర్వహించిన సక్సెస్ మీట్ లో శివ కార్తికేయన్..’ అమరన్ మూవీ కలెక్షన్స్ 150 కోట్లు దాటిందంటున్నారు.. నిజం చెప్పాలంటే నాకు మూవీ కలెక్షన్స్ ఎంతో ముఖ్యం. సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేస్తేనే నెక్స్ట్ మూవీ లకు బడ్జెట్ ఎక్కువ పెడతారు. ఎక్కువ బడ్జెట్ పెట్టినప్పుడే మనం భారీ చిత్రాలను మంచి కథతో తీసి అవకాశం ఉంటుంది ‘ అని అన్నారు. ఈ సినిమాకి సాయి పల్లవి బలం అని అందరు అంటున్నారు. మూవీ లాస్ట్ ప‌ది నిమిషాలు సాయి పల్లవి నటన అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఎంతో గొప్ప నటి..అమరన్ మూవీ ద్వారా ఆమెకు తమిళ్ లో కమర్షియల్ సక్సెస్ రావడం ఆనందంగా ఉంది. ఆమె లాంటి హీరోయిన్స్ కు ఇలాంటి కమర్షియల్ సక్సెస్‌లు చాలా అవసరం..’ అని అన్నారు. అయితే శివ కార్తికేయన్ అన్న మాటలకు ఇప్పటివరకు సాయి పల్లవికి తమిళ్ సక్సెస్ లు లేవు అన్నట్లు అందరికీ అర్థమైంది. అంతే కాకుండా ఆమె సినిమాల‌కు డ‌బ్బులు రావ‌ట్లేద‌ని ఇండైరెక్ట్ గా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ హీరో మాట‌ల‌పై సాయిప‌ల్ల‌వి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సాయిప‌ల్ల‌వి కూడా ఈ వ్యాఖ్య‌ల‌ను ప‌ర్స‌న‌ల్‌గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని ప్ర‌స్తావించింది. ‘నాకు అమరన్ ద్వారా తమిళంలో మొదటి సక్సెస్ అని శివ కార్తికేయన్ అన్నారు. అలాగే ఈ మూవీ తో తెలుగులో ఆయనకు మొదటి కమర్షియల్ సక్సెస్ రావడం.. అది కూడా నా సినిమాతో కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ‘ అని సాయి పల్లవి కౌంటర్ ఇచ్చారు. ఇక సాయిప‌ల్ల‌వి ఫ్యాన్స్ ఖుష్ అయిపోతున్నారు. నెటిజన్లు సాయి పల్లవి కౌంటర్ వీడియోను వైరల్ చేస్తూ ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *