Site icon

నాగ‌చైత‌న్య‌కు ఇచ్చిన గిఫ్టులపై స‌మంత కామెంట్స్

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇప్పుడు బాలీవుడ్‌లో సైతం బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవ‌ల సెటాడెల్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. మ‌రో వైపు స‌మంత మాజీ భ‌ర్త నాగ చైత‌న్య రెండో పెళ్లి వేడుక‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో స‌మంత ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో నాగ‌చైత‌న్య పై చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. సిటాడెల్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా స‌మంత బాలీవుడ్ న‌టుడు వ‌రున్ ధావ‌న్‌తో ఓ ఇంట‌ర్వ్యూకు హాజ‌రైంది. ఈ ఇంట‌ర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్‌లో భాగంగా స‌మంత‌ను వ‌రున్ ప‌లు ప్ర‌శ్న‌లు అడిగాడు. ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ డ‌బ్బులు వృథాగా దేనికి ఖ‌ర్చే చేశావ‌ని ప్ర‌శ్నించాడు. దానికి స‌మాధానంగా నా మాజీకి ఇచ్చిన బ‌హుమ‌తుల కోస‌మ‌ని స‌మంత రిప్లై ఇచ్చింది. కొన‌సాగింపుగా ఎంత ఖ‌ర్చు చేశావ‌ని వ‌రున్ అడిగాడు. కాస్త ఎక్కువే ఖ‌ర్చు చేశానంటూ.. ఇంత‌టితో ఈ టాపిక్ ముగిద్దామంటూ స‌మంత న‌వ్వింది. ఇక చైత‌న్య పెళ్లి ముందు స‌మంత చేసిన కామెంట్లు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి. మ‌రో వైపు నాగ‌చైత‌న్య త‌న ప్రియురాలు శోభితా దూళిపాళ్ల‌తో డిసెంబ‌ర్ 4న వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌నున్నాడు. వీరి పెళ్లి హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జ‌ర‌గ‌నుంది.

Share
Exit mobile version