కొత్త ప్రాజెక్ట్ మొద‌లెట్టేసిన సంయుక్త !

విరూపాక్ష సినిమాతో బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్‌ ఇచ్చిన సంయుక్తా మీన‌న్ వ‌రుస చాన్సుల‌తో దూసుకెళ్తోంది. సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీలో ఒక్క‌ సినిమా హిట్ అయితే చాలు నిర్మాతలంతా హీరోయిన్ వెంట పడతారు. అలాంటిది వ‌రుస‌గా రెండు మూడు సినిమాలు హిట్ అయితే గోల్డెన్ లెగ్‌ గా ముద్ర వేసేస్తారు. ఇదే దారిలో సంయుక్త ఒక వైపు ప్రేక్షకులతో మ‌రో వైపు నిర్మాతలతో గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. బింబిసార సినిమాతో హీరోయిన్ గా తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది సంయుక్త మీనన్. ఆ త‌ర్వాత‌ ధనుష్ టాలీవుడ్ డెబ్యూ సార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక సాయి ధరమ్ తేజ్ తో చేసిన విరూపాక్ష సినిమా సెన్సేషన‌ల్‌ హిట్ కొట్టడంలో సంయుక్త మీనన్ దే కీలక పాత్ర. ఇదే జోరు మీద సంయుక్త మీన‌న్‌ టాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమా నేడు గ్రాండ్ లాంఛ్ అవుతోంది. చింతకాయల రవి ఫేమ్‌ డైరెక్టర్ యోగేష్ అలియాస్ యోగి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా రానా దగ్గుబాటి హాజరుకానున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *