Site icon

శోభితా డ్యాన్స్ వీడియో వైర‌ల్‌!

అక్కినేని నాగ‌చైత‌న్య‌తో పెళ్లితో ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయిపోయిన న‌టి శోభితా ధూళిపాళ్ల‌. శోభితా, నాగ‌చైత‌న్య‌ల పెళ్లి అయిపోయినా కానీ ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ఈ జంట పేరు మారుమోగిపోతూనే ఉంది. వీరికి పెళ్లికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. పెళ్లి కూతురిగా ముస్తాబ‌వుతూ శోభితా సంతోషంతో డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వీడియోలో త‌న మేక‌ప్ చేసిన శ్ర‌ద్ధా మిశ్రాను పిలుస్తూ… శ్ర‌ద్ధా మేరీ షాదీ హో ర‌హీ హై అంటూ శోభితా సంతోషంగా స్టెప్పులేస్తోంది. ఈ వీడియోను శోభితా, నాగ‌చైత‌న్య ఫ్యాన్స్ షేర్ చేస్తుంటే స‌మంత ఫ్యాన్స్ సామ్‌ను కాపీ కొడుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share
Exit mobile version