Site icon

2018లోనే నాగార్జున ఇంటికి వెళ్లాను!

టాలీవుడ్ కొత్త జంట‌ శోభితా ధూళిపాళ్ల , నాగ‌చైత‌న్య గురించి సోష‌ల్ మీడియాలో ఇంకా చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. శోభితా పెళ్లి , నాగ‌చైత‌న్య‌తో ల‌వ్ స్టోరీపై నెటిజ‌న్లు తీవ్ర ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అయితే తాజాగా శోభితా, నాగ‌చైత‌న్య ఇటీవ‌ల ఓ జాతీయ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో శోభితా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. తాను నాగార్జున ఇంటికి 2018లోనే తొలిసారి వెళ్లిన‌ట్లు చెప్పారు. అయితే చైతూతో మాత్రం 2022 నుంచే స్నేహం చేస్తున్న‌ట్లు చెప్పుకొచ్చింది. త‌న‌కు, చైతూకు ఫుడ్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, ఎప్పుడు క‌లిసినా ఫుడ్ గురించే మాట్లాడుకునేవాళ్ల‌మ‌ని చెప్పుకొచ్చింది. త‌ను తెలుగులో మాట్లాడితే చైత‌న్య‌కు చాలా న‌చ్చుతుంద‌ని, ప‌దే ప‌దే త‌న‌ను తెలుగులోనే మాట్లాడ‌మ‌ని చెప్పే వాడ‌ని తెలిపింది. ఇన్ స్టాలో 2022 నుంచే ఒక‌రినొక‌రు ఫాలో చేసుకుంటున్నామ‌ని, త‌న గ్లామర్‌ ఫొటోల‌కు కాకుండా ఇత‌ర పోస్టుల‌కు నాగ‌చైత‌న్య లైక్ కొట్టే వాడ‌ని తెలిపింది. మొదటిసారి ముంబైలోని ఓ కేఫ్‌లో చైతన్యను కలిసినట్లు శోభిత చెప్పింది.ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్ల‌డంతో పాటు అనంత‌రం అమెజాన్‌ ప్రైమ్‌ ఈవెంట్‌కు వెళ్లిన‌ట్లు చెప్పుకొచ్చింది. ఇక త‌ర్వాత త‌మ సంగ‌తి మీడియాకు తెలిసిపోయింద‌ని వెల్ల‌డించింది. ఇక ఆ త‌ర్వాత సంవ‌త్స‌రం అంటే 2023లో గోవాలో నాగచైతన్య కుటుంబం న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కు తనను ఆహ్వానించినట్లు శోభిత తెలిపింది. ఆ త‌ర్వాత ఒక‌రినొక‌రు అర్థం చేసుకొని గోవాలో పెళ్లి ప్ర‌తిపాద‌న తీసుకొచ్చిన‌ట్లు చెప్పింది.

Share
Exit mobile version