Site icon

చైతు దొర‌క‌డం నా అదృష్టం

ఇటీవ‌ల మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టైన టాలీవుడ్‌ కొత్త జంట శోభితా ధూళిపాళ్ల‌, నాగ చైత‌న్య. నాగార్జున‌తో క‌లిసి నాగ‌చైత‌న్య దంప‌తులు శ్రీశైలం ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఈ క్ర‌మంలో కొత్త జీవితం గురించి శోభిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ‘చైతన్య త‌న‌ జీవితంలోకి రావడం అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది. చైతూ సింప్లిసిటీ, అందరితో గౌరవంగా ఉండే విధంగా త‌న‌కు ఎంతో నచ్చేశాయ‌ని చెప్పింది. ప్రేమలో ఆత్మీయత ఎక్కువగా ఉండాలనేది చైతూ నుంచి తాను నేర్చుకున్న‌ట్లు చెప్పింది. పెళ్లి తర్వాత శ్రీశైలం వెళ్లి శివుడిని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతనిచ్చింద‌ని, చిన్నప్పటి నుంచి త‌న‌ జీవితంలో దైవభక్తి భాగమేని వెల్ల‌డించింది. టైమ్ దొరికినప్పుడల్లా కూచిపూడి, భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తుంట‌ద‌. ఇక‌ వంట కూడా వ‌చ్చ‌ని, ఆవకాయ, ముద్దపప్పు చాలా బాగా చేస్తాన‌ని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

Share
Exit mobile version