టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా పుష్ప సినిమాలో చేసిన కిసిక్ ఐటెం సాంగ్‌తో శ్రీలీలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు శ్రీలీలకు బాలీవుడ్ నుంచి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా శ్రీలీల ఓ బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పింది. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ఆషికీ 3లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సినిమా వరకు ఓకే కానీ ఈ జంట బయట కూడా చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారని టాక్ వినిపిస్తోంది. శ్రీలీల కార్తీక్ ఆర్యన్ కు సంబంధించిన ఫ్యామిలీ ఫంక్షన్‌కు కూడా హాజరవడం విశేషం. అంతే కాకుండా ఇటీవల కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఓ అవార్డు ఫంక్షన్ లో కరణ్ జోహార్ కార్తీక్ ఆర్యన్ తల్లిని ప్రశ్నిస్తూ… మీ ఇంటికి ఓ నటి కోడలిగా వస్తే అంగీకరిస్తారా అని అడిగారు. దీనికి ఆమె తమ ఇంటికి డాక్టర్ కోడలిగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. శ్రీలీల మెడిసిన్ చదివింది కాబట్టి ఆమెను దృష్టిలో పెట్టుకునే ఈ మాటలు అన్నారని టాక్ నడుస్తోంది. ఇక శ్రీలీల , కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ఆషికీ3 దీపావళి కానుకగా ఈ ఏడాది విడుదల కానుంది. మరి ఈ రూమర్లకు ఈ జంట ఏమని సమాధనం చెబుతారో వేచి చూడాలి.