టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కుమారుడు, నటుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లల వివాహం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ వేడుకను ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య నిర్వహించారు. బుధవారం రాత్రి 8.15 నిమిషాలకు నాగచైతన్య శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగార్జున ఎక్స్ వేదికగా పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. ఇక సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులు, అల్లు అరవింద్ దంపతులు, హీరోలు ఎన్టీఆర్, వెంకటేశ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, అడవి శేష్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తదితరులు హాజరయ్యారు.