టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మెగాస్టార్ చిరంజీవిని నేడు ఆయన ఇంట్లో కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో షేర్ చేసుకున్నారు. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించనున్న అక్కినేని శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని చిరంజీవిని నాగార్జున ఆహ్వానించారు. ఈ వేడుకలకు బిగ్ బి అమితాబచ్చన్ హాజరవుతున్నారు.అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందజేయనున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఓకే ఫోటోల్లో కనిపించడంతో ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నాగార్జున షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.