పుష్ప హిట్‌తో అల్లు అర్జున్ నేషనల్ వైడ్‌గా స్టార్ డమ్ సంపాదించేసుకున్నాడు. ఈ సినిమాతో బన్నీకి నేషనల్ అవార్డు కూడా వచ్చేసింది. ఇదే ఊపులో డిసెంబర్ 5న పుష్ప-2 విడుదల చేసేందుకు టీం సిద్ధమైంది. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలెట్టేశారు. బన్నీ కెరీర్‌లో పుష్ప బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోతుంది. ఇటు పుష్ప కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తుండగానే బన్నీ నెక్ట్స్ మూవీపై అప్‌డేట్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ పుష్ప తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించనున్నాడు. ఇప్పటికే వీళ్ల కాంబినేషన్‌లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి హిట్ సినిమాలు వచ్చాయి. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్‌లో నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందన్నారు. రాజమౌళి మూవీస్ లో చాలా హైట్స్ చూపించారని, రాజమౌళి టచ్ చేయని జోనర్ లో త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా ఉండబోతోందని చెప్పారు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయిందన్నారు. ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించి అధికారిక ప్రటకన వస్తుందన్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి. మరో వైపు పుష్ప-2 విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1000 కోట్ల బిజినెస్ చేసినట్లు టాక్ నడుస్తోంది.