Site icon

నేటి నుంచి ఓటీటీలోకి అమ‌ర‌న్‌

త‌మిళ నటుడు శివ కార్తికేయన్, స్టార్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి జంట‌గా నటించిన మూవీ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వ‌చ్చిన ఈ మూవీ ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. ఈ సినిమాను రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ దీపావళి కానుకగా తెలుగు, తమిళం, మళయాళంలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మూవీతో శివ‌కార్తికేయ‌న్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇప్ప‌టికే భారీ లాభాలు సాధించిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతోంది. డిసెంబ‌ర్ 5న ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. అమరన్ నేటి నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Share
Exit mobile version