అల్లు అర్జున్‌కు షాకిచ్చిన ఏపీ స‌ర్కార్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవేటెడ్ మూవీ పుష్ప‌-2 మ‌రో రెండు రోజుల్లో విడుద‌ల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప మూవీ టికెట్ల రేట్ల‌పై సందిగ్ధ‌త నెల‌కొన్న వేళ ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలో టికె్ట‌ల రేట్ల పెంపున‌కు అనుమ‌తి ఇచ్చింది. గ‌తంలో ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అల్లు అర్జున్ ఓ వైసీపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పుష్ప సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు కూట‌మి ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రాక‌పోవ‌చ్చ‌ని అంతా భావించారు. సోష‌ల్ మీడియాలో దీనిపై పెద్ద దుమారం చెల‌రేగింది. అటు మెగా ఫ్యాన్స్, ఇటు బ‌న్నీ ఫ్యాన్స్ ఒక‌రిపై ఒక‌రు కామెంట్ల‌తో తీవ్ర రాద్ధాంతం చేశారు. మొత్తానికి ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్ప‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లు పెంచుకోవ‌చ్చ‌ని తెలిపింది. పుష్ప టికెట్ల ధరలపై ఏపీ స‌ర్కార్‌ అధికారికంగా జీవో విడుదల చేయడంతో అ‍ల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు. ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోలకు అనుమతి ల‌భించింది. రెండు బెనిఫిట్ షోలకుగాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌లలో ఏదైనా సరే టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. ఈ ధరకు జీఎస్‌టీ అద‌నంగా ఉంటుంది. డిసెంబర్ 5న ఆరు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్స్‌లలో లోయర్‌ క్లాస్‌ రూ.100, అప్పర్‌ క్లాస్‌ రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. ఇక్కడ కూడా జీఎస్టీతో కలిపి టికెట్లు కొనాల్సి ఉంటుంది. ఈ ధరలు అన్నీ కూడా ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలకు అదనంగా యాడ్‌ అవుతుంది. డిసెంబరు 17 వరకు మాత్రమే పెంచిన ధరలు వర్తిస్తాయి. టికెట్ల పెంపున‌కు అనుమ‌తి ల‌భించ‌డంపై అల్లు అర్జున్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *