Site icon

సూప‌ర్ స్టార్ బ‌ర్త్ డే.. ప్ర‌ముఖుల నుంచి శుభాకాంక్ష‌ల వెల్లువ‌

నేడు సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కు ఉన్న‌ ఫ్యాన్స్ , ప్ర‌ముఖుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. నేటితో ర‌జ‌నీ కాంత్‌ 74వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్నారు. ర‌జ‌నీకాంత్‌కు ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల నుంచి శుభాకాంక్ష‌లు అంద‌డం విశేషం. ఏపీ సీఎం చంద్ర‌బాబు, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఆయ‌న‌కు విషెస్ తెలిపారు. ఈ మేర‌కు వారు ఇరువురు ఎక్స్ వేదిక‌గా పోస్టులు చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు త‌న పోస్టులో… నా ప్రియ మిత్రుడు, లెజెండ‌రీ ర‌జ‌నీకాంత్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఆయ‌న ఆయురారోగ్యాల‌తో మ‌రిన్ని పుట్టిన‌రోజులు జ‌రుపుకోవాలి. కెరీర్ లో మ‌రిన్ని విజ‌యాల‌ను సాధించాలి” అని రాసుకొచ్చారు. సీఎం స్టాలిన్ త‌న పోస్టులో.. ”స‌రిహద్దులు దాటి, తన నటన, శైలితో ఆరు నుండి అరవై ఏళ్ల వ‌ర‌కూ అభిమానులను సంపాదించిన నా అద్భుతమైన స్నేహితుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు! సినీ పరిశ్రమలో నిరంతర విజయాలు సాధిస్తున్న మీరు ఎల్లప్పుడూ శాంతియుతంగా, సంతోషంగా ఉండాలని, ప్రజలను మెప్పించాలని కోరుకుంటున్నాను” అని విషెస్ తెలిపారు. వీరితో పాటు ప్ర‌ముఖ న‌టులు చిరంజీవి, వెంక‌టేష్, క‌మ‌ల్ హాస‌న్, ఎస్.జే సూర్య త‌దిత‌రులు సూప‌ర్ స్టార్‌కు విషెస్ తెలిపారు.

Share
Exit mobile version