బాహుబ‌లికి వెల్లువెత్తుతున్న బ‌ర్త్ డే విషెస్ !

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ బ‌ర్త్ డే నేడు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖుల నుంచి ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌భాస్ అభిమానులు గ్రాండ్ సెలెబ్రేష‌న్స్ చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో హ్యాపీ బ‌ర్త్ డే ప్ర‌భాస్ అంటూ ట్రెండ్ న‌డుస్తోంది. మ‌రో వైపు ప్ర‌భాస్ సినిమాల రీ రిలీజ్‌ల‌తో థియేట‌ర్లు సంద‌డిగా మారాయి. ఈ అక్టోబ‌ర్ 23 తో ప్ర‌భాస్ 45 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాడు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన‌ ప్రభాస్ వ‌రుస హిట్ల‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ పటంలో నిలబెట్టాడు. ప్ర‌భాస్ కు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ప్ర‌ముఖులంతా విషెస్ చెప్తున్నారు. హ్యాపీ బ‌ర్త్ డే డార్లింగ్ అంటూ కొంద‌రు, తెలుగు సినిమాను ప్ర‌పంచ ప‌టంలో నిల‌బెట్టావ‌ని కొంద‌రు పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, గోపీచంద్‌, శ్రీవిష్ణు, డైరెక్ట‌ర్లు అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మతో పాటు ఎంతోమంది ప్ర‌ముఖులు త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో విషెస్ పోస్టు చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *