బలగం సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అయిన నటుడు వేణు. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వేణుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత వేణు ఎవరితో సినిమా తీస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎల్లమ్మ అనే మరో కొత్త కథతో వేణు రెడీ అయ్యాడు. బలగం సినిమాను నిర్మించిన దిల్‌రాజు ఈ సినిమాను కూడా నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ సాయిపల్లవి నటిస్తోందని టాక్ వచ్చింది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్ అందించేందుకు బాలీవుడ్ వరకు వెళ్లింది మూవీ టీం. బాలీవుడ్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్, అతుల్ ఈ సినిమాకు పని చేయనున్నారు. తాజాగా వర్క్ కూడా స్టార్ట్ చేశారని టాక్. మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.