Site icon

బ‌న్నీ ఫ్యాన్స్ కు షాకిస్తున్న తెలంగాణ పోలీస్

ఇటీవ‌ల పుష్ప విడుద‌ల స‌మ‌యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్‌కు హీరో అల్లు అర్జున్ రాక‌తో తొక్కిస‌లాట జ‌రిగి ఓ మ‌హిళ మృతి చెందిన ఘ‌ట‌న‌లో బ‌న్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఓ రోజు జైలులో సైతం ఉన్నారు. అనంత‌రం జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయ‌డంపై ఆయ‌న అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా సీఎం రేవంత్ రెడ్డి, పోలీసుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు బ‌న్నీ ఫ్యాన్స్ పై కేసులు న‌మోదైన‌ట్లు స‌మాచారం. సీఎం రేవంత్ రెడ్డిపై అస‌భ్య‌క‌రంగా పోస్టులు పెట్టారంటూ ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు బ‌న్నీ ఫ్యాన్స్ పై ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు సైబ‌ర్ క్రైం పోలీసులు నిందితులపై ఐటీ యాక్ట్ తో పాటు బీఎన్ఎస్‌ 352, 353(1)(బీ) సెక్షన్ల‌ కింద కేసులు నమోదు చేశారు. వీరితో పాటు మ‌రింత మందిపై కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Share
Exit mobile version