తమిళ సూపర్ స్టార్లు నయనతార, ధనుష్ మధ్య ఓ వివాదం ముదిరి రచ్చకెక్కింది. దీంతో ఎక్స్ వేదికగా నయనతార ధనుష్‌పై విమర్శలు చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తన డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్పా టలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోగా ధనుష్ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని నయన్ తెలిపింది. ఈ సందర్భంగా బహిరంగ లేఖను ఎక్స్ లో పోస్టు చేసింది. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం నానుమ్ రౌడీ దాన్. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా వండర్ బేర్స్ బ్యానర్‌పై ధనుష్ నిర్మించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్‌గా నయనతారపై నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోలో నానుమ్ రౌడీ దాన్ సినిమాలోని పాటలను నయనతార వాడుకున్నందుకు ధనుష్ నయనతారకు నోటీసులు పంపించారు.రూ.10 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇదే విషయంపై నయనతార ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యింది.